అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
తాడ్వాయి, ఫిబ్రవరి, 5 (విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చందాపూర్ గ్రామానికి చెందిన చాకలి ప్రసాద్( 22) అనే యువకుడు అప్పుల బాధతో మృతి చెందినట్లు ఎస్త్స్ర నరేష్ తెలిపారు. ఎస్త్స్ర తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి ప్రసాద్ బ్రతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పది నెలల క్రితం తిరిగి ఇండియాకు వచ్చాడు. వచ్చిన నాటి నుంచి దుబాయ్ వెళ్లడం కోసం చేసిన అప్పులు, ఇక్కడ ఉన్న అప్పులతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు.
తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఈనెల 2న మధ్యాహ్నం సమయంలో తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి అక్కడే గడ్డి మందు తాగాడు. తాగిన అనంతరం తన మేనమా మ సాయిలు కు ఫోన్ చేసి సమాచారం అం దించాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి గడ్డి మందు తాగిన ప్రసాద్ ను గుర్తించి అక్కడి నుంచి చికిత్స కోసం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఈ నెల 4 న నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై తల్లి రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర వివరించారు.




