1 July, 2026 | 10:44 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అప్పుల బాధతో యువకుడి మృతి, ఉపాధ్యాయుడి మృతి

20-06-2025 12:43 AM

అప్పుల బాధ భరించలేక యువకుడు మృతి చెందిన సంఘటన చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో జరిగింది. చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగారపు శ్రీకాంత్(26) తన అవసరం నిమిత్తము అప్పులు చేశాడు.

ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక మదనపడుతూ ఉండేవాడు. దీంతో మనస్తాపానికి గురై గురువారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్ళి  చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. మృతుని తల్లి నాగారపు శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

కొండాపూర్, జూన్ 19: కొండాపూర్ మండల పరిధిలోని మారేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కలబ్గూర్ వాస్తవ్యులైన మధుసూదన్ పాఠశాలలో విధులు నిర్వహిస్తుం డగా అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందాడు.

పాఠశాల తోటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉండేవాడని ఆయన చేసిన సేవలు విద్యార్థులు మరువ లేవని కొనియాడారు. ఉపాధ్యాయుని మృతితో పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.