1 July, 2026 | 11:49 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

పోలీస్ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరం

20-06-2025 12:42 AM

వాజేడు, జూన్ 19 (విజయ క్రాంతి): పోలీస్ చట్టాలపై ప్రజలకు అవగాహన అవసరమని వాజేడు మండల పరిధిలో గల పేరూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ మేరకు గురువారం పేరూరు రైతు వేదికలో ఏర్పాటుచేసిన అభయ మిత్ర కార్యక్రమంలో పాల్గొని చట్టాల గురించి ప్రజలు పాటించవలసిన విధుల గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరూరు, ధర్మవరం, ఐవారి పేట, కృష్ణాపురం, టేకులగూడెం, చండ్రుపట్ల గ్రామాలలోని ప్రజలకు ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ఒక్క ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించరాదని, చట్టరీత్యా నేరస్థలవుతారని తెలియజేశారు.

వాహనాలు నడిపే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలు కలిగి ఉండాలని , లేనియెడల జూన్ 20 నుండి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయబడుతుందని హెల్మెట్ లేని వాహనాలను సీజ్ చేయబడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రైతులకు, యువకులకు, మహిళలకు డ్రగ్స్, సైబర్ క్రైమ్, నకిలీ విత్తనాల విక్రయం, పోక్సో చట్టం పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాంపురం గ్రామ యూత్ టీంకు వాలీబాల్ కిట్టు అందించారు.