16 April, 2026 | 8:02 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

17-12-2025 06:16 PM

రేగొండ (విజయక్రాంతి): చేపల వేటకు వెళ్ళి యువకుడు మృతిచెందిన ఘటన రేగొండ మండలం కనిపర్తి గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కనిపర్తి గ్రామానికి చెందిన మునిగాల రాజు(30) ముదిరాజ్ కులస్తుడు కాగా వృత్తి రిత్యా బుధవారం ఉదయం గ్రామ శివారులోని చలి వాగులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చేపల వల కాలికి చుట్టుకుని నీటిలో మునిగి మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య అనూష ఉండగా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య అనూష ఫిర్యాదు మేరకు రేగొండ ఎస్సై కె.రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.