16 April, 2026 | 6:10 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పెన్షనర్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది

17-12-2025 06:19 PM

పెన్షనర్ డే సందర్భంగా రిటైర్డ్ యూనివర్సిటీ ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ

హనుమకొండ (విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చిత్త శుద్ధితో పని చేస్తుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పెన్షనర్స్ డే సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో సెనేట్ హాల్ లో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ముఖ్య అతిథులుగా వైస్ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి,తో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు గౌరవంగా ఉందని, సేవలో ఉన్న రోజుల్లో సంస్థకు ఇచ్చిన కృషి ఇప్పటికీ కనిపిస్తోందని, ఈ విశ్వవిద్యాలయానికి ఉన్న గౌరవం, ప్రమాణాలు ఉద్యోగుల శ్రమ ఫలితం అన్నారు.

పదవీ విరమణతో బాధ్యతలు ముగిసినా, అనుభవం ముగియదన్నారు. సమాజానికి రిటైర్ ఉద్యోగులే మార్గదర్శకులన్నారు. పెన్షన్, వైద్య సదుపాయాలు, ఇతర హక్కులు సమయానికి అందేలా చర్యలు తీసుకునేలా, అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి రిటైర్డ్ ఉద్యోగుల సూచనలు కీలకమని,వారి అనుభవాన్ని వినియోగించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీకి సంబంధించిన ప్రతి న్యాయమైన డిమాండ్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. 

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాకతీయ యూనివర్సిటీకి నిధులు కేటాయించేలా జిల్లా ప్రతినిధులందరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలే ఓయు అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు చిర్ర రాజు గౌడ్, పల్లకొండ సతీష్,రిటైర్డ్ ప్రొఫెసర్ల సంఘ అధ్యక్షులు సదానందం, కార్యదర్శి వడ్డే రవీందర్, రామిరెడ్డి, వీరన్న,కూరపాటి వెంకటనారాయణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.