calender_icon.png 4 December, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడిపై కత్తితో దాడి మద్యం సేవించి గొడవపడిన యువకులు

04-12-2025 01:32:03 AM

కామారెడ్డి, డిసెంబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో ఇద్దరు యువకుల మధ్య మాట మాట పెరిగి కత్తిపోట్లకు దారి తీసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని రామేశ్వర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సమీపంలో ఎదురుగా వెంచర్ లో ఓ యువకుడి పై మరో యువకుడు కత్తితో దాడి చేయడంతో యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు.

ఈ ఘటన కలకలం రేపింది. కామారెడ్డి పట్టణ పరిధిలోని రామేశ్వర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న సుతారి రాజశేఖర్ పై అదే కాలనీలో నివాసం ఉంటున్న గంగని ప్రవీణ్ అలియాస్ చింటూ దాడి చేయడంతో రాజశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు కత్తిపోట్లకు గురైన రాజశేఖర్ వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి కి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉండడంతో కామారెడ్డి ప్రభుత్వాసుపత్రి నుంచి నిజాంబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న రాజశేఖర్, గంగని ప్రవీణ్ లు స్నేహితులుగా ఉంటున్నారు. సమీపంలోని వెంచర్లో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఇద్దరు ఒకరిని ఒకరు తిట్టుకోవడంతో మాట    మాట పెరిగి కత్తిపోట్లకు దారి తీసినట్లు స్థానికులు తెలిపారు.

మద్యం మత్తులోనే రాజశేఖర్ పై గంగని ప్రవీణ్ అలియాస్ చింటూ కత్తితో దాడి చేయడంతో రాజశేఖర్ కడుపులోని పేగులు బయటకు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన జరిగిన విషయాన్ని దేవుని పల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మద్యం మత్తులో ఇద్దరు వీరంగం సృష్టించినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. దేవునిపల్లి పోలీసులు గంగని ప్రవీణ్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రవీణ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.