20 July, 2026 | 6:15 PM

Breaking News

అత్యాచారం కేసులో నిందితుడికి 20 వేల జరిమాన   •   బ్యాంక్ వార్షికోత్సవం   •   అదనంగా పిఎంసిహెచ్ బాలుర, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో వినతి పత్రం   •   పాత బావి పూడ్చి అంగన్‌వాడీ, పీహెచ్‌సీ ఏర్పాటు చేయాలి   •   రైతులకు ఎల్నీనో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన   •   గణపురంలో 169.4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత   •   కోనరావుపేటలో టీఎస్‌యూటీఎఫ్ పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభం   •   ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ   •   టీఎస్‌యూటీఎఫ్ పోస్టుకార్డు ఉద్యమం   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్   •  

తాగునీటి సమస్యలు తీర్చిన ఆధార్ పార్టీ అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్: బీజేపీ నాయకులు తంబళ్ల రవి

18-05-2026 02:28 AM

 కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

దమ్మపేట. మే 17 (విజయ క్రాంతి) :  అశ్వరావుపేట నియోజకవర్గం  దమ్మపేట మండలంలోని మందనపల్లి గ్రామంలో తాగునీటి కోసం గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామస్తులు ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కంటే కేశవ గౌడ్ స్పందించి తక్షణమే ఆ గ్రామానికి వాటర్ ట్యాంకు ద్వారా తాగునీటిని సరఫరా చేశారు.

అర్ధరాత్రి గ్రామస్తులు ఆయనకు సమాచారం అందించడంతో హుటా హుటీనా  ట్యాంకర్ ద్వారా తాగునీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవికాలం నేపథ్యంలో ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తాగునీటి ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా వేసవికాలంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంటుందని వాటిని పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆధార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.