20 May, 2026 | 9:10 AM

బాలకృష్ణతో ఆది పినిశెట్టి ఫైట్

09-02-2025 12:00 AM

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తోంది ‘అఖండ 2: తాండవం’. ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించబోతున్నారు. ఈ పాత్రను బోయపాటి ఫెరోషియస్‌గా రూపొందించారు.

ఆది కెరీర్‌లో మోస్ట్ ఇం పాక్ట్ పాత్రల్లో ఒకటిగా నిలవనుంది. అంతే కాదు ఆది కొత్త లుక్‌లో కనిపించనున్నారు. బాలకృష్ణ, ఆది మధ్య జరిగే పేస్ అఫ్ అభిమానులకు ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లింగ్ విజువల్  ఫీస్ట్ అందించబోతోందని సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో జరుగుతోంది. ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. బాలకృష్ణ, ఆది ఇద్దరూ ఈ యాక్షన్-ప్యాక్డ్ షూట్‌లో పాల్గొంటున్నారు.

ఈ సీక్వెల్‌లో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.