5 August, 2026 | 2:57 AM

సర్పంచ్ భర్త పెత్తనం పై ఫిర్యాదు చేసిన వార్డు సభ్యులు

05-08-2026 01:58 AM

మనోహరాబాద్, ఆగస్టు 4 (విజయక్రాంతి) : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు తూప్రాన్ డివిజనల్ పంచాయతి అధికారి సాయిబాబా కు కూచారం గ్రామ సర్పంచ్ భర్త సర్పంచ్ గా పెత్తనం చలాయిస్తున్నాడని అతని ప్రవర్తన పై ఫిర్యాదు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో అందిన ఫిర్యాదు మేరకు డివిజన్ పంచాయతీ అధికారి సాయిబాబా గ్రామ పంచాయతీలో సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో వార్డు సభ్యులచే వచ్చిన ఫిర్యాదును వారు చెప్పిన విషయాలను పరిశీలించారు. ఎంపీ ఓ, ఇందులో గ్రామ వార్డు మెంబర్స్, గ్రామస్తులు ఉన్నారు.