జేఈఈ మెయిన్స్‌లో ఆకాశ్ హవా
సత్తా చాటిన షేక్‌పేట బ్రాంచి విద్యార్థులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో హైదరాబాద్‌లోని ఆకాశ్ ఇన్‌స్టిట్యూట్ షేక్‌పేట్ బ్రాంచి విద్యార్థుల హవా కొనసాగింది. విద్యాసంస్థకు చెందిన రిషి శేఖర్‌శుక్లా, మురికినాటి దివ్యతేజరెడ్డి , నయూఫ్ అష్రఫ్, ధ్రువ్ ఝవర్, ఆసియా నాజ్, సౌమిల్ ప్రధాన్, భువన్‌కుమార్ ఉత్తమ ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశారని ఇన్‌స్టిట్యూట్ చీఫ్ అకాడమిక్ అండ్ బిజినెస్ హెడ్ ధీరజ్ మిశ్రా తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత కఠినమైన జేఈఈ పరీక్షలో తమ విద్యార్థులు ఘనవిజయం సాధించారని, విద్యార్థుల శ్రమ, అధ్యాపకులు కృషి, కుటుంబసభ్యుల సహకారంతో నే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




