పది ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం

01-05-2024 01:55:52 AM

రాష్ట్ర స్థాయిలో 135 అత్యధిక 10 జీపీఏలు 

కరీంనగర్ సిటీ, ఏప్రిల్ 30: అత్యుత్తమ బోధన ద్వారా అగ్రశేణి ఫలితాలను సాధించవచ్చని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డా. వీ నరేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ ట్రైనిటాట్స్ ప్రాంగణంలో  నిర్వహించిన విజయోత్సవ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. అల్ఫోర్స్ గ్రూఫ్ ఆఫ్ స్కూల్స్‌కు చెందిన 135 మంది విద్యార్థులు 10 జీపీఏలు సాధించడం గొప్ప విషయమని ప్రశంసించారు. 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారని, 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏ పొందారని వెల్లడించారు. 747 మంది విద్యార్థులు 9 జీపీఏ, ఆపై మార్కులు సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రకటించిన ఇంటర్, జేఈఈ (మెయిన్) ఫలితాల్లోనూ అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ఉత్తమ ర్యాంకులు సాధించారని గుర్తుచేశారు. అత్యధిక సంఖ్యలో 10 జీపీఏలు సాధించిన విజేతలందరికీ పుష్ప గుచ్ఛాలను అందజేశారు.  భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని అకాక్షించారు. ఉపాధ్యాయులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.