27 July, 2026 | 1:47 AM

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆప్ సంబరాలు

27-07-2026 01:08 AM

అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులకు కొవ్వొత్తుల నివాళి

ముషీరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, పేపర్ లీకేజీల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులకు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద  నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెన్-జీ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు మాట్లాడుతూ  దేశంలో అవినీతిపై పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. పేపర్ లీకేజీల కారణంగా మృతి చెందిన 21 మంది విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి పరిహారం చెల్లించాలని, నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జ్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.