24 June, 2026 | 2:43 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు

22-04-2026 03:52 PM

లక్ష్మణ చందా,(విజయక్రాంతి): టీజీ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ఉద్యోగుల సంక్షేమం కోసం వారు చేస్తున్న సమ్మెకు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మాత్రమే ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యక్షంగా పాల్గొని వారికి సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అబ్దుల్ సాదిక్ వసంతరావు ఉన్నారు