గ్యాంగ్‌స్టర్‌తో ఆప్ ఎమ్మెల్యే?
ఆడియో క్లిప్ విడుదల చేసిన బీజేపీ
అది నకిలీ ఆడియో అంటూ ఆప్ ఖండన
న్యూఢిల్లీ, నవంబర్ 30: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యం లో ఢిల్లీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే నరేశ్ బల్యాన్.. ఓ గ్యాంగ్ స్టర్‌తో మాట్లాడిన వీడియోను బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాలవీయ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే నరేశ్ స్థానిక గ్యాంగ్‌స్టర్ల అండతో బిల్డర్లను బెదిరించి దోపిడీలకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో దానికి సంబంధి ంచిన ఆడియో క్లిప్‌ను ఆయన షేర్ చేశా రు.
ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీలో దోపిడీ రాకెట్ నడుపుతున్నారని మాలవీయ పేర్కొన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలు సరిగాలేవంటూ కేంద్రంపై నిందలేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో బిల్డర్లు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలో గ్యాంగ్‌స్టర్‌తో ఆప్ ఎమ్మెల్యే నరేశ్ మాట్లాడుకున్నట్లుగా ఆడియో క్లిప్ లో ఉందని తెలిపారు. కాగా బీజేపీ నేతల ఆరోపణలను ఆప్ తీవ్రంగా ఖండించింది. మాలవీయ ఆరోపణలపై ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్‌సింగ్ మాట్లాడుతూ అది నకిలీ ఆడియో క్లిప్ అని పేర్కొన్నారు. ఢిల్లీలో నేరాల గురించి కేజ్రీవాల్ ప్రస్తావించడంతోనే నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.






