17 June, 2026 | 8:38 PM

Breaking News

సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •   జల్ జీవన్ మిషన్‌తో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు   •  

ఆరోగ్యశ్రీ, డాటాఎంట్రీ ఆపరేటర్లను తిరిగి నియమించాలి

13-10-2025 12:45 AM

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ 

కామారెడ్డి, అక్టోబర్ 12 (విజయ క్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లను యధావిధిగా కొనసాగించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆయన మాట్లాడారు. ఆరు నెలల పెండింగ్ వేతనాలు అడిగినందుకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగుల తొలగింపు అన్యాయమని అన్నారు.

డాటా ఎంట్రీ ఆపరేటర్లు గత కొన్ని సంవత్సరాలుగా నిబద్ధతతో ఆసుపత్రికి సేవలు అందిస్తున్నారని అన్నారు. ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. ఆరోగ్యశ్రీ సేవల్లో వారి పాత్ర కీలకమైన గాని వారిని తొలగించడం వల్ల దూర ప్రాంతాల నుండి కామారెడ్డి జిల్లా జెండాల ఆసుపత్రికి వచ్చారుల సేవల కు అంతరాయం కలుగుతుందని అన్నారు.

ప్రస్తుతం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బంది అందరికీ సమానత్వలు సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. లేకుంటే నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేయాల్సి వస్తుందని మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బాబు తెలిపారు.