13-10-2025 12:45:14 AM
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
మునిపల్లి, అక్టోబర్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు గ్యారంటీ లేని పథకాలుగా మిగులుతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. పీఎస్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పైతర సాయికుమార్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోల్కంపల్లి - ఖమ్మంపల్లి గ్రామాల శివారులో ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హాజరై మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాంతం అభివృద్ది చెందిందన్నారు. కాని రెండేళ్ల కాంగ్రెస్ పాలన అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని, ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీ లేని పథకాలుగా మిగిలాయని ఎద్దేవా చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.50 లక్షలు మంజూరు చేసి గ్రామాలను అభివృద్ది చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న దామోదర్ రాజనర్సింహ్మ అందోల్ ను అభివృద్ది చేయడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నారాయణ, పుల్కల్ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, మునిపల్లి మండల ప్రధాన కార్యదర్శి శశికుమార్, మాజీ సర్పంచులు శంకర్, శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ మంద రాజశేఖర్, మాజీ ఎంపీపీ చంద్రయ్య, పీఎస్ ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తాటిపల్లి మల్లేశం, నాయకులు గడ్డం భాస్కర్, పరుశరాం గౌడ్, ఆనంద్ రావు, మౌలాన, మొగులయ్య, మోహన్, ఇమ్రాన్ పటేల్, రాజు, జంషీద్, అంజన్న, శేఖర్, వెంకటేశం, రమేష్ గౌడ్, దత్తు, నాగన్న, సిరాజోద్దీన్, శేఖర్, ఖుర్షిద్, సురేష్ తదితరులుపాల్గొన్నారు.