calender_icon.png 13 October, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథలకు దహన సంస్కారాలు

13-10-2025 12:46:20 AM

ఎండీఆర్ ఫౌండేషన్  మధు 

పటాన్ చెరు, అక్టోబర్ 12 : పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లపై చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 45 ఏళ్ల అనాథ మరణించగా ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎండిఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. మానవతా విలువలకు ప్రతీకగా, సమాజ సేవలో అగ్రగామిగా నిలిచే ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో నిరంతరం ముందుండి సేవలందిస్తున్న ఎం డి ఆర్ ఫౌండేషన్‌ను స్థానికులు అభినందించారు.