05-02-2026 01:30:37 AM
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
వైభవ్ సూర్యవంశీ, మాత్రే మెరుపులు
ఇంగ్లాండ్‌తో టైటిల్ పోరు
హరారే, ఫిబ్రవరి 4 : భారత కుర్రాళ్లు మరోసారి దుమ్మురేపారు. అండర్ 19 ప్రపంచకప్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచారు. టోర్నీ ఆరంభం నుంచీ అదరగొడుతున్న భారత్ అండ ర్ 19 జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. రికార్డు స్థాయిలో పదోసారి టైటిల్ పోరుకు రెడీ అయింది. సెమీఫైనల్లో భారత్ అండర్ 19 జట్టు 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌పై విజయం సాధించింది. ఆరో న్ జార్జ్ సెంచరీతో చెలరేగితే.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపులు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయి. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 310 పరుగుల భారీస్కోరు చేసింది. అఫ్గాన్ బ్యాట ర్లు ఫైసల్ షినోజాడా, ఉజైరుల్లా నియాజై సెంచరీలతో చెలరేగారు. భారీ టార్గెట్ కావడంతో ఎంత బ్యా టింగ్ పిచ్ అయినా కాస్త ఒత్తిడి ఉంటుంది.
కానీ భారత యువ ఓపెనర్లు దూకుడే మంత్రంగా ఆడారు. తొలి వికెట్ కు 9.1 ఓవర్లలోనే 90 పరుగులు జో డించారు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ ఎప్పటిలానే రెచ్చిపోయాడు. భారీ షాట్ల తో ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వైభవ్ కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీ లో అతనికిది మూడో హాఫ్ సెంచరీ. వైభవ్ సూర్యవంశీ 68 ( 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రన్స్‌కు ఔటవగా.. తర్వాత ఆరోన్ జార్జ్ , కెప్టెన్ ఆయుశ్ మాత్రే అదే దూకుడు కొనసాగించారు. రెండో వికెట్ కు 114 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.
మాత్రే 62 (5 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. మరోవైపు ఆరోన్ జార్జ్ మాత్రం నిలకడగా ఆడు తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన 9వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. విహాన్ మల్హోత్రా కూడా జత కలవడంతో భారత్ 41.3 ఓవర్లలోనే లక్ష్యా న్ని అందుకుంది. ఈ విజయం తో పదోసారి వరల్ కప్ ఫైనల్లో అడుగుపెట్టి రికా ర్డు సృష్టించింది. అలాగే వరుసగా ఆరు ఎడిషన్లలో ఫైనల్ చేరుకున్న జట్టుగా నిలిచింది. 2016, 2018, 2020, 2022, 2024 లలో కూడా భారత్ ఫైనల్‌కు దూసుకొచ్చింది. అత్యధిక సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టుగానూ రికార్డులకెక్కింది. భారత్ ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం జరిగే ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.