వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి
13-07-2026 09:17 PM
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేటీపీపీలో కొనసాగుతున్న నిరసన
గణపురం,(విజయక్రాంతి): యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు నిర్వహణ విభాగాల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేటీపీపీలో టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపా రు. వైటీపీఎస్ ఉద్యోగుల పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిం చుకుని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడంతో పాటు ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






