14 July, 2026 | 12:01 AM

లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?

13-07-2026 09:20 PM

టిఆర్ఎస్ సదాశివనగర్ మండల అధ్యక్షుడు కాలాలి సాయగౌడ్

సదాశివ నగర్,(విజయక్రాంతి): లక్క పురుగులతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని టిఆర్ఎస్ సదాశివనగర్ మండల అధ్యక్షుడు  సాయగౌడ్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం  అడ్లూరు ఎల్లారెడ్డి  గ్రామ శివారులో ఉన్న గోదాముల నుండి  అడ్లూరు ఎల్లారెడ్డి, కుప్రియల్, మర్కల్  గ్రామాల్లోకి  వస్తున్న లక్క పురుగుల నివారణ చేపట్టలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సైతం ఈ గోదాముల నుండి పురుగులు  గ్రామాలలో సందడి చేసి  తినే భోజనాలలో, మనుషులపై వాలుతూ ప్రజలకు ఇబ్బందికి గురి చేస్తున్నాయని, కలెక్టర్ స్పందించి ఈ గోదాములను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల లక్క పురుగులు  ఇలానే కొనసాగితే  పెద్ద ఎత్తున గోదాములను  టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామన్నారు. టిఆర్ఎస్ పార్టీ  ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం  జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడ్లూర్ ఎల్లారెడ్డి రెడ్డి గ్రామ అధ్యక్షుడు మోసర్ల శ్రీకాంత్ రెడ్డి, కుప్రియల్ గ్రామ అధ్యక్షుడు చాకలి లింగం తదితరులు పాల్గొన్నారు.