17 July, 2026 | 6:05 PM

నిబంధనలు పాటించకపోతే జరిమానాలు

04-06-2024 02:44 AM

మంథని, జూన్ 3 (విజయక్రాంతి): నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పవని మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ రమా సురేశ్‌రెడ్డి హెచ్చరించారు. పట్టణాన్ని ఇంటిలా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. నిత్యం మున్సిపల్ సిబ్బంది వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నారని, అయినా కొంతమంది వ్యాపారులు చెత్తను ఇష్టారీతిలో రోడ్లపై వేస్తున్నారని అన్నారు. అలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. పర్యటనలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

-మంథని మున్సిపల్ చైర్‌పర్సన్ రమా సురేశ్ రెడ్డి