సీపీఎస్ రద్దు.. ఓపీస్ ముద్దు..
పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు : మహా ధర్నాకు హైదరాబాద్ తరలిన సీపీఎస్ ఉద్యోగులు
వికారాబాద్,ఆగస్టు- 23( విజయ క్రాంతి ) సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ కావాలంటూ హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో చేపట్టిన మహా ధర్నాకు సిపిఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. TSCPSEU రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆదివారం వికారాబాద్ జిల్లా లోని ప్రతి మండలం నుండి ఉద్యోగులందరు పెద్ద మొత్తం లో LB స్టేడియం కు హాజరై పాత పెన్షన్ కా వాలంటూ, అంతేగాకుండా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే OPS ఇస్తామని చెప్పి 3 సం రాలు అయినప్పిటికి ఇంకా అమలు చేయక పోవడం పట్ల CPS ఉద్యోగులు తీవ్ర నిరసన తెలుపడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో వికారాబాద్ CPS ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు పట్నం. రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి Mౄ. అయూబ్ రాష్ట్ర బాధ్యులు మురహరి, భాస్కర్, వేణు శివప్రసాద్, వెంకన్న, రాకేష్, ముస్తఫా, రవీందర్, మహేందర్ శ్రీనివాస్, మాణిక్యం, తాజోద్దీన్, వెంకటరెడ్డి శ్రావణ్,,మహిళా ఉద్యోగులు పెద్ద మొత్తం లో పాల్గొన్నారు.






