1 August, 2026 | 5:50 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత

24-08-2024 10:20 AM

శేరిలింగంపల్లి, (విజయక్రాంతి): హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) ఎక్కడా తగ్గడం లేదు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తూ తనపని తాను చేసుకుపోతుంది. నిజానిజాలు నిర్దారణ చేసుకుని బఫర్, ఎఫ్టీఎల్ లో ఉన్న నిర్మాణాలను కూల్చివేతలు చేపదుతుంది. ఈ ఉదయం నుండి హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను చేపట్టింది హైడ్రా. తెల్లవారుజామునే జంబో మెషిన్ లతో కూల్చేసేందుకు హైడ్రా సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. భారీ పోలీసుల బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపట్టారు. తిమ్మిడికుంటకు సంబందించిన బఫర్ లోనే ఎన్ కన్వెన్షన్ ను కట్టారని అనేక ఫిర్యాదులు రావడం, వార్తా కథనాలు రావడంతో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.