దళితబంధు నిధులను విడుదల చేయాలి
ప్రజా భవన్ ఎదుట లబ్ధిదారుల ధర్నా
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండో విడత దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళితబంధు సాధన సమితి ఆ ధ్వర్యంలో శుక్రవారం ప్రజాభవన్ ఎదుట ధర్నా చేశారు. దళితబంధు సాధన సమితి అధ్యక్షుడు కొగిలి మహేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని కొనసాగిస్తున్నట్టుగా, అందుకు రూ. 2 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించినట్టుగా అసెంబ్లీలో ప్రకటించిందని గుర్తు చేశారు.
కానీ లబ్ధి దారులకు నిధులు కేటాయించడంలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై న దళితబంధు యూనిట్లను విడుదల చేయాలని కోరారు. లేదంటే మంత్రులు, ప్రజాప్రతినిధులను తిరగనివ్వబోమని హెచ్చరించారు. ధ ర్నాలో దళితబంధు సాధన సమితి రాష్ట్ర ఉ పాధ్యక్షుడు బోనగిరి శ్రీనివాస్, కన్వీనర్ చిట్టిమల్ల సమ్మయ్య, కో ఆర్డినేటర్ మడికొండ రమేష్, నాయకులు చిలుమల శంకర్, శంకర్, పాలడుగుల వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






