నిధులు పుష్కలం..
అభివృద్ధికి ఆమడ దూరంలో దేవరకద్ర మున్సిపాలిటీ
- బల్దియాలో ఏఈ లేక పనులు ఆగాయంట..
- పశువుల టెండర్ రూ.57 లక్షలు, తైబజార్ వేలం రూ.10 లక్షలు
- కనీస సౌకర్యాలుంటే ఒట్టు..
- ఎమ్మెల్యే ఆదేశించిన అడుగులు ముందుకు పడట్లే..
- ఒంటికి, రెంటికి అవస్థలు పడుతున్న జనం
- ఆరోపణలు కాదు.. అభివృద్ధి కావాలంటున్న మున్సిపాలిటీ
దేవరకద్ర, జూన్ 25 : ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వమని కాదు. ఏ ప్రభుత్వము ఉన్న ప్రజలకు నిత్య అవసరమైన సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై సంబంధిత అధికారులపై ఉంది. జనం సంక్షేమం కోసమే నిరంతరం తమ జీవితం అంకితం చేస్తున్నాం అంటూ ప్రకటిస్తున్న నేతలు దేవరకద్ర మున్సిపాలిటీలో సంత బజార్ తో పాటు కూరగాయల మార్కెట్లో సైతం కనీస సౌకర్యాలు లేక మహిళలు పురుషులు అనే భేదం లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఏండ్ల తరబడి వారు ఆవేదనకు గురి అవుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అంటూ కాలయాపన చేస్తూ టాయిలెట్లు కూడా మున్సిపాలిటీలో లేకుంటే వందలాదిమంది సంతకు వస్తున్న లక్షలాది రూపాయలు టెండర్ రూపంలో దేవరకద్ర మున్సిపాలిటీకి ఆదాయం సమకూరుతున్న జనం కు అవసరమైన సదుపాయాలు కల్పించడంలో మాత్రం అందనంత దూరంలో ఆగిపోయింది. మహిళలు సైతం గంటల తరబడి నిరీక్షించి కూరగాయలను విక్రయించడంతోపాటు ఇతర వివిధ పనులకు నియోజకవర్గ కేంద్రమైన దేవరకద్ర కు వస్తున్నప్పటికీ అక్కడ ఉన్న సౌకర్యాలను చూసి ఎవ్వరికి చెప్పుకోలేని బాధతో ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు.
మున్సిపాలిటీకి ఆదాయం... సౌకర్యాలు పట్టవా..
దేవరకద్ర గ్రామపంచాయతీ ఉన్నప్పటి నుంచి దేవరకద్రలో నిర్వహించే పశువుల సంతకు చాలా డిమాండ్ ఉంది. వందలాదిమంది పశువులను తీసుకువచ్చి విక్రయాలు కొనసాగిస్తూ దేవరకద్ర నాటి గ్రామపంచాయతీ తో పాటు నేటి మున్సిపాలిటీకి కూడా ఆదాయం సమకూర్చడంలో వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. గడిచిన వేలంపాటలో దేవరకద్ర మున్సిపాలిటీకి సంత బజారుకు సంబంధించి రూ 57 లక్షల వేలం పాట పాడి దక్కించుకున్నారు. తై బజార్ కు సైతం రూ 10 లక్షల ఆదాయం సమకూరుంది. కాగా నాటి నుంచి నేటి వరకు కూడా అక్కడ వచ్చే జనానికి కనీస సౌకర్యాలైన టాయిలెట్ ల తో పాటు రూ రూపాయల భోజనం కూడా అందుబాటులోకి తెస్తే ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చే వారిగా ఈ ప్రభుత్వానికి పేరు వస్తుందని ప్రజలు కోరుతున్నారు.
ఎమ్మెల్యే చెప్పిన అడుగు పడట్లే...
గడిచిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి బహిరంగంగానే గత ప్రభుత్వం దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కనీసం టాయిలెట్లు కూడా కల్పించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఈ ప్రభుత్వ హయాంలో అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశించిన జనానికి ఇప్పటివరకు అడుగులు పడట్లేదు. ఇకనైనా వెనువెంటనే కనీస సౌకర్యాలు అయిన టాయిలెట్లను సంత బజార్ తో పాటు కూరగాయలు విక్రయించే ప్రాంతంలో కూడా టాయిలెట్లు నిర్మించి జనానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
నిలువెత్తు నిర్లక్ష్యం...
దేవరకద్రలో నిర్మించిన బ్రిడ్జి కింది భాగంలో వివిధ అభివృద్ధి పనులు చేసేందుకు రూ 15 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పనులు చేసేందుకు కూడా ఇప్పటికే టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ 7 లక్షల 50 వేలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు పనులకు ఇష్టిమేషన్లతో పాటు తదుపరి ప్రక్రియ నిర్వహించేందుకు ఏఈ లేకపోవడంతో పనులు ఆగిపోవడం విడ్డూరంగా మారింది.
ఈ ప్రభుత్వం వచ్చి కూడా రెండున్నర సంవత్సరాలు అయినప్పటికీ గత కొద్ది రోజులుగా మున్సిపాలిటీలో ఏఈ లేని కారణంగా నూతన పనులకు శ్రీకారం చుట్టూ లేకపోతున్నామని సంబంధిత మున్సిపాలిటీ ప్రధాన అధికారి చెబుతున్నారంటే ఆ ఏయ్ ఎప్పుడు వస్తారు ఈ పనులు ఎప్పుడు ప్రారంభం అవుతాయని సందేహం నెలకొంది. ఇప్పటికైనా ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి అవసరమైన ఏఈని వచ్చేలా చేయించుకొని పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఏఈ లేకపోవడంతోనే..
ప్రస్తుతం మున్సిపాలిటీలో నూతన పనులను చేయాలంటే ఏఈ ముఖ్యం. అధికారి వచ్చిన వెంపడే పనులను ప్రారంభిస్తాం. నిధులు అందుబాటులో ఉన్నాయి. జనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేలా ముందుకు సాగుతాం.
నరేష్ బాబు, దేవరకద్ర మున్సిపల్ కమిషనర్.






