విత్తన మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి
కోదాడ జాన్ 25: విత్తన మేళ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం కోదాడ మండలం లి అల్వాలపురం, గుడిబండ రైతువేదికల్లో ఏర్పాటుచేసిన విత్తనమేలలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతులు నాణ్యమైన, ప్రభుత్వం సూచించిన సన్న రకాలను కొనుగోలు చేయాల్సిందిగా తెలియచేశారు. వర్షాభావ పరిస్థితుల్ల దృష్టిలో ఉంచుకొని రైతులు ఆరుతడి పంటలు కందులు, పెసర్లు, కూరగాయలు పంటలు సాగుచెయ్యాలని సూచించారు.
కోదాడ మండలం లోని ఎరువుల దుకాణాల ఎరువుల నిల్వలను పరిశీలించి యాప్ ద్వారానే యూరియా ఎరువు కొనుగోలు చేసుకోవాలని, డీలర్స్ ఎమ్మార్పీ కి ఎరువులను అమ్మాలని, రైతులను ఇబ్బంది పెట్టిన యెడల కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ సహాయ సంచాలకులు , ప్రశాంతి, కోదాడ మండల వ్యవసాయ అధికారి పాలెం రజని, వ్యవసాయ విస్తరణ అధికారి నగేశ్, పిచ్చయ్య, మహేష్, రైతులు, డీలర్స్ పాల్గొన్నారు.






