4 April, 2026 | 2:39 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

దుర్భాషలు.. బెదిరింపులు!

13-02-2026 12:00 AM
  1. స్పీకర్ చాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల దురుసు ప్రవర్తన
  2. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆరోపణ 
  3. సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల 

న్యూ ఢిల్లీ, ఫ్రిబ్రవరి 12: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేదికగా అధికార, -ప్రతిపక్ష ఎంపీల మధ్య సంఘర్షణ కొనసాగుతోంది. ఇక  ప్రతిపక్ష ఎంపీలకు సంబంధించిన వీడియోలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో వరుసగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేయగా తాజాగా స్పీకర్ చాంబర్లో ఓం బిర్లాను విపక్ష ఎంపీలు బెదిరిస్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు.

లోక్‌సభలో ప్రధానిని చుట్టుముట్టేందుకు కాంగ్రెస్ ఎంపీలు కుట్ర పన్నారని, విపక్షాల నిరసనల దృష్ట్యా ప్రధానిని సభకు రావొద్దని సూచించినట్లు ఇటీవల స్పీకర్  ఓం బిర్లా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈ నెల 4వ తేదీన స్పీకర్ చాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల దురుసు ప్రవర్తన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. 

20నుంచి-25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా చాంబర్‌లోకి చొరబడి.. ఆయనను, ప్రధానమంత్రిని దుర్భాషలాడి బెదిరించారని కేంద్రమంత్రి ఆరోపించారు. చట్టవిరుద్ధంగా రికార్డ్ చేసిన వీడియోను షేర్ చేశారని కిరణ్ రిజిజు ఆరోపించారు. 

“గౌరవ  స్పీకర్ చాంబర్లోకి 20--25 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశించి ఆయనను దుర్భాషలాడి. ప్రధానమంత్రిని బెదిరించినప్పుడు ఒక కాంగ్రెస్ ఎంపీ తీసిన చట్టవిరుద్ధమైన వీడియో క్లిప్ ఇది. మా పార్టీ చర్చలను నమ్ముతుంది. ఎంపీలు భౌతికంగా బెదిరించడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదు.’  అని రిజిజు ఎక్స్‌లో రాశారు.