ప్రధాని మోదీ ‘ఏ చోక్‌హోల్డ్’!
- రాహుల్‌గాంధీ పునరుద్ఘాటన
- పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర పరిణామం
- బీజేపీ మంత్రుల వద్దకు ప్రతిపక్ష నేత
- కలిసే మీడియాతో మాట్లాడుదామన్న రాహుల్
- ఎంపీ వింత వైఖరికి వెళ్లిపోయిన కేంద్రమంత్రులు
- తన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయన్న కాంగ్రెస్ అగ్రనేత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12 : అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఎప్‌స్టీన్ ఫైల్స్ అంశాలపై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. ప్రధాని మీద ప్రత్యక్ష ఒత్తిడి ఉందని, సాధారణ పరిస్థితుల్లో ఏ ప్రధాని కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని రాహుల్ వ్యాఖ్యానించారు. రైతుల డేటా భద్రత అంశాల్లో దేశాని కి నష్టం జరుగుతోందని ఆరోపించారు.
ప్రధాని ‘చోకోహోల్డ్ ఉన్నారు‘ అన్న తన వ్యాఖ్యను మరోసారి పునరుద్ఘాటించారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. లోక్ సభలో రాహుల్ చేసిన ఆరోపణలపై మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రులుప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్‌ల వద్దకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేను గా వెళ్లారు. కలిసి మాట్లాడుదాం‘ అంటూ మీడియా ముందే వ్యాఖ్యానిస్తూ మంత్రులతో కలిసి నిలబడేందుకు ప్రయత్నించారు.
రాహుల్ గాంధీ జోషి చేతిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రాహుల్ వింత వైఖరితో ఇద్దరు మంత్రులు సమావేశాన్ని మధ్యలోనే ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలు, సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉండగా, వారు ఈ ఘటనను నవ్వుతూ చూశారు. మంత్రులు వెళ్లిపోయిన తర్వాత రాహుల్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ మంత్రు లు మీడియా ముందు నుంచి తప్పించుకున్నారని రాహుల్ విమర్శలు చేశారు.




