18 August, 2026 | 8:43 AM

రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ దాడి

24-05-2024 12:48 AM

రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డీటీ

చర్ల, మే 23:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడి చేశారు.  డిప్యూటీ తహసీల్దార్ భరణిబాబు ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలానికి చెందిన కర్ల రాంబాబుకు పట్టాదారుపా సు పుస్తకం చేయడానికి డీటీ భరణిబాబు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీం తో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు డీటీ కి రూ.20 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. భరణిబాబు ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. గతంలో బూర్గంపాడు డీటీగా పనిచేస్తున్నప్పుడు ట్రాక్టర్ యజమానుల నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.