ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
24-05-2024 12:52 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 23 (విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా బుద్ధ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సిర్పూర్ (టీ) మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా కేంద్రంలో బౌద్ధమత పెద్దలు బుద్ధుని చిత్రపటంతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద అన్నదానం చేపట్టారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు శ్యాంనాయక్, రావి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






