27-06-2025 02:01:57 PM
మందమర్రి:(విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఫోటో వీడియో గ్రాఫర్(Photo Videographer) మామిడాల మధుకర్ కు పట్టణ ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు అండగా నిలిచారు. మధుకర్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి పొందుతుండగా శుక్రవారం అసోసియేషన్ సభ్యులు 5000 రూ,, ఆర్థిక సహాయం అందించి బాధితుని కి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బాధితుడిని పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య గౌడ్, పట్టణ అధ్యక్షులు పసుల వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి ఆడెపు అశోక్ కుమార్, కోశాధికారి బద్రి సతీష్, గౌరవ సలహాదారులు నక్క తిరుపతి, జాడి ముకుందం, వర్కింగ్ ప్రెసిడెంట్ వలస మణిరాజ్, ఉపాధ్య క్షులు లక్కిరెడ్డి అనిధర్ రెడ్డి, ఆర్ సుజిత్, నక్క పవన్, ప్రచార కార్యదర్శి కందుకూరి శ్రీకాంత్, మాజీ ఉపాధ్యక్షులు విక్టరీ అశోక్, బాసం అంజి, వరుణ్ లు పాల్గొన్నారు.