ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
27-05-2026 02:58 PM
హైదరాబాద్: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ( Anti-Corruption Bureau) సోదాలు చేస్తోంది. నాగోల్ జగ్జీవన్ రామ్ ఆర్టీఏ కార్యాలయంలో(Dr. Babu Jagjeevanram Driving Test Track) ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు నడుస్తున్నాయనే సమాచారంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఎంవీఐలు, ఏఎంవీఐలను సైతం ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎంవీఐలు, ఏఎంవీఐలు, ఏజెంట్ల ఫోన్లును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయంలోకూడా ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు.






