23 July, 2026 | 3:02 AM

సర్ 100% పూర్తి చేసేందుకు రాజకీయ పక్షాలు సహకరించాలి

23-07-2026 01:58 AM

తాసీల్దార్ రామ్మోహన్ రావు

బెజ్జూర్, జూలై 22 (విజయక్రాంతి): సర్ ప్రోగ్రాం 100% పూర్తి చేసేందుకు రాజకీయ పక్షాలు సహకరించాలని  తహసిల్దార్  పి రామ్మోహన్ రావు అన్నారు. బుధవారం కార్యాలయంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్  రామ్మోహన్ రావు మాట్లాడారు. బెజ్జూర్ లో ఇప్పటికే 85% సర్ ప్రోగ్రాం పూర్తయిందని 100% పూర్తి చేసేందుకు అందరు సహకరించాలని కోరారు. సర్ ప్రోగ్రాం ఫారాలు తీసుకున్న ప్రజలు  ఆగస్టు మూడు లోగా బీ ఎల్ ఓకు పారాలు అందజేయాలని సూచించారు.

ఇప్పటికే చనిపోయిన ఓటర్లు, డబుల్ గా ఉన్న ఓట్లను గుర్తించినట్లు తెలిపారు. బిఎల్‌ఓ ల వద్ద పారాలు తీసుకున్న ప్రతి ఓటరు, పారాలు రిటన్ చేయాలని, రిటర్న్ చేయని వారి ఓటు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. గ్రామాల్లో రాజకీయ నాయకులు సర్ ప్రోగ్రాం సక్సెస్ కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి, జిపిఓ మారుతి, జావిద్, బిజెపి ,కాంగ్రెస్ బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.