27 May, 2026 | 3:50 PM

బీజేపీ బస్సు యాత్రతోనే ప్రభుత్వంలో కదలిక

27-05-2026 02:48 PM

కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వ(Telangana Govt) నిర్లక్ష్యంతో రైతులు అరిగోస పడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay ) మండిపడ్డారు. దెబ్బతిన్న వరి పంటను పరిశీలించిన బండి సంజయ్ బొమ్మకల్ కొనుగోలు కేంద్రంలో రైతులతో సమావేశం అయ్యారు. ఐకేపీ సెంటర్లు, రోడ్లు, ధాన్యం రాశులతో నిండిపోయాయని బండి సంజయ్ పేర్కొన్నారు.

అకాల వర్షాలతో ధాన్యం మొత్తం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఇంకా నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. బీజేపీ బస్సు యాత్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో కదిలిక వచ్చిందని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు డబ్బును కేంద్రమే భరిస్తున్నప్పుడు మీకు ఇబ్బందేంటి? అని కేంద్రమంత్రి ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు విధించకుండా కొనాలని డిమాండ్ చేశారు.