23 July, 2026 | 2:28 AM

అంతర్జాతీయ పోటీకి అనుకూలంగా విద్యా బోధన చేయాలి

23-07-2026 01:56 AM

బాసర త్రిబుల్ ఐటీ సందర్శించిన కలెక్టర్ 

బైంసా, జులై 22 ( విజయక్రాంతి): అంతర్జాతీయ రంగంలో పోటీపడే విధంగా బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులకు విద్యాబోధన ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవే ష్ మిశ్రా సూచించారు.బుధవారం కలెక్టర్ బాసర ఐఐఐటి క్యాంపస్ను సందర్శించి, విశ్వవిద్యాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యా ర్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఆధునిక సాంకే తికతను సమర్థంగా వినియోగించి, విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీపడే స్థాయికి తీర్చిదిద్దాలని తెలిపారు. విద్యార్థులకు కావలసిన అన్ని సదుపాయాలు ప్రభుత్వపరంగా కల్పిస్తామని విద్యార్థులు బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలని సూచిం చారు.ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటి ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్, తహసీల్దార్ పవన్ చంద్ర, విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.