calender_icon.png 21 February, 2026 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగర్ కర్నూల్ జిల్లాలో ఏసీబీ దాడులు

21-02-2026 12:28:46 PM

ఆదాయానికి మించి ఆస్తుల అనుమానం

కల్వకుర్తి ఏడీ బంధువుల ఇళ్లలో సోదాలు

నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తెలంగాణ ఏసీబీ అధికారులు నాగర్ కర్నూల్ జిల్లాలో(Nagarkurnool District) దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అనుమానంతో కల్వకుర్తి సబ్‌డివిజన్ వ్యవసాయ శాఖ ఎడి సుందరి కిరణ్ కుమార్ కు చెందిన బంధువుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కల్వకుర్తి పరిధితో పాటు ఇతర ప్రాంతాల్లోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఆస్తుల పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, స్థిరాస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ దాడులు ఉదయం నుంచి కొనసాగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.