calender_icon.png 16 September, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో ఏసీబీ సోదాలు

16-09-2025 09:29:45 AM

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ అధికారులు(ACB officials) దాడులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖ ఏడీఈ (Electricity Department ADE)అంబేడ్కర్ ఇంట్లో మంళవానం ఏసీబీ(Anti Corruption Bureau) తనిఖీలు చేస్తోంది. మణికొండలో ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేడ్కర్ పై భారీగా అవినీతి ఆరోపణలున్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులపై ఇతర జిల్లాల్లోనూ సోదాలు నిర్వహిస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేస్తుంది. మణికొండలోని ఏడీఈ ఇల్లు, బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.