16-09-2025 11:55:50 AM
పటాన్చెరు,(విజయక్రాంతి): కాలనీలలో రోడ్లమీద బహిరంగంగా చెత్త వేస్తే జిహెచ్ఎంసి సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి చెత్త వేసిన వారిపై ఫైన్ వేసి కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే జైలుకు పంపుతామని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్(Patancheru Corporator Mettu Kumar) హెచ్చరించారు. జి.హెచ్.ఎం.సి డిప్యూటీ కమిషనర్ సురేష్ తో కలిసి పటాన్చెరు డివిజన్ పరిధిలో వివిధ కాలనీలో బహిరంగంగా చెత్త వేసే ప్రదేశాలను సందర్శించారు. ఇకపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే ఉపేక్షించ వద్దని హెచ్చరించారు, వెంటనే చెత్తను తీసివేసి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసి చెత్త వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం శాంతినగర్ లోని బతుకమ్మ ఘాట్ ను సందర్శించి బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా శుభ్రం చేయాలని ఆదేశించారు.