calender_icon.png 16 September, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విరాళం

16-09-2025 11:53:36 AM

చిట్యాల(విజయక్రాంతి): మండలంలోని ఎలేటి రామయ్యపల్లి గ్రామంలో నిర్మిస్తున్న ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.గ్రామానికి చెందిన ఎలేటి శ్రీనివాస్ రెడ్డి,నాగరాజులు వారి తండ్రి రామ్ రెడ్డి పేరుపైన రూ. 1,11,116లు,కొత్తూరి వెంకటమ్మ-సమ్మిరెడ్డి రూ1,00,116 అందజేసి ఉదారతను చాటుకున్నారు.ఈ విరాళం ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి సహాయపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.ఈ సందర్భంగా విరాళాన్ని అభినందిస్తూ వారికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.మరి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.