16-09-2025 11:58:06 AM
చికిత్స పొందుతు నిన్న సాయంత్రం మరణించిన వెంకటేష్
కుటుంబ తగాదాలే కారణం..
భార్య పద్మను రిమాండ్ కు తరలించిన మల్దకల్ ఎస్ఐ నందికర్
గద్వాల,(విజయక్రాంతి): నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ వేడి నూనె పోసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) మల్దకల్ మండలం మల్లెందోడ్డి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళితే గత 8 సంవత్సరాల క్రితం వెంకటేశ్ పద్మలకి వివాహం జరిగింది కాగా వీరికి ముగ్గురు సంతానం కాగా వివాహం అనంతరం భార్య, భర్తలు తరుచు గొడవ పడేవారని అందులో భాగంగా ఈ నెల 11వ తేది ఉదయం 5గంటల సమయంలో నిద్రిస్తున్న భర్త వెంకటేష్ పై భార్య పద్మ నూనెను వేడి పోసింది. వెంకటేష్ కు తీవ్ర గాయాలు కాగా గద్వాల ఆసుపత్రి తరలించగా పరిస్థితి విషమించడంతో డాక్టర్లు కర్నూల్ ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతు నిన్న సాయంత్రం వెంకటేష్ మరణించడం జరిగింది. ఈ నెల 11వ తేదిన సంఘటన జరిగిన రోజు భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం పద్మను రిమాండ్ కు తరలించడం జరిగిందని మల్దకల్ ఎస్ఐ నందికర్ తెలిపారు..