11 August, 2026 | 1:26 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

26-06-2025 03:15 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ(Anti-Corruption Bureau) సోదాలు చేస్తోంది. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. 17 మంది ఏజెంట్లు అక్రమ దందాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు(ACB Raid) గుర్తించారు. ఆర్టీఏ ఏజెంట్ల నుంచి అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఉప్పల్, తిరుమలగిరి, పెద్దపల్లిలో సోదాలు జరిగాయి. పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంలో(RTA offices) ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. తిరుమలగిరి ఆర్టీఏ ఆఫీసులో ఇద్దరు క్లర్కులు, 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.