24 August, 2026 | 10:37 AM

హైదరాబాద్‌ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

24-08-2026 09:30 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన లండన్ పర్యటనను ముగించుకుని సోమవారం ఉదయం హైదరాబాద్(Hyderabad ) చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని లండన్‌లోని ప్రవాస తెలుగువారిని ముఖ్యమంత్రి ఆదివారం కోరారు. ప్రస్తుతం జరుగుతున్న తన యూకే పర్యటనలో భాగంగా లండన్‌లోని తెలుగువారితో సమావేశమైన రేవంత్ రెడ్డి, వారు రాష్ట్రానికి రాయబారులుగా వ్యవహరించాలని, ప్రభుత్వం 'తెలంగాణ రైజింగ్ 2047' (Telangana Rising 2047) దార్శనికతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చినట్లు ఒక ప్రకటన తెలిపింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu), వివిధ రంగాలలో రాష్ట్రం సాధించిన పురోగతి, భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ , ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో కూడా చర్చలు జరిపింది. యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్(University of Cambridge), ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇతర సంస్థలు తెలంగాణతో సహకార అవకాశాలను పరిశీలించడానికి అంగీకరించాయని ఆ ప్రకటన పేర్కొంది. సీఎం రేవంత్ ఆగస్టు 20న యూకేకు బయలుదేరారు. తన పర్యటన ముగిసిన తర్వాత అమెరికాకు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. అయితే, అమెరికా పర్యటనకు(Revanth US tour) కేంద్రం అనుమతి ఇవ్వలేదు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్(Jubilee Hills MLA Naveen Yadav) తో పాటు పలువురు  కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు.