27-06-2025 12:03:26 AM
వనపర్తి, జూన్ 26 (విజయక్రాంతి): జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో 9వ గేట్ రోప్‌వే గురువారం తెగిపోయింది. జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్న కర్ణాటక జలాశయా ల నుంచి కృష్ణా నదిలోకి భారీగ వరద నీరు వచ్చి చేరుతోంది. గత నాలుగు రోజుల నుం చి జూరాలకు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంతో జలాశయం గరిష్ఠ నీటిమట్టానికి చేరువ కావడంతో ప్రాజెక్టు అధికారులు వరద నీటి మట్టాన్ని నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఇందులో భాగంగా ప్రాజెక్టుకు ఉన్న మొత్తం గేట్లలో 12 గేట్లను ఎత్తివేసి, వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు, శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నారు. డ్యాం గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో గురువారం డ్యామ్ 9వ గేట్ రోప్ తెగిపోయింది. దీంతో స్థానిక ప్రజానీకంలో, ఆయకట్టు రైతులలో భయాందోళనలు సృష్టిస్తోంది.
జూరాల ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో ఏ క్షణం ఏ ప్రమాదం జరుగుతుం దోన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు. అయితే 9వ గేటు రోప్ తెగడంపై డ్యామ్ అధికారులను సంప్రదించగా అలాంటిది ఏమి లేదని, ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం లేదన్నారు.