17 August, 2026 | 8:57 PM

ప్రజావాణి కార్యక్రమంలో 11 దరఖాస్తుల స్వీకరణ

17-08-2026 07:55 PM

పినపాక, ఆగస్టు 17, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించబడిన ప్రజావాణి కార్యక్రమానికి మండల ప్రజల నుంచి సమస్యలతో కూడిన 11 వినతిపత్రాలను స్వీకరించడం జరిగినదని ఎంపీడీవో సంకీర్త్ పత్రిక ముఖంగా తెలిపారు. రెవిన్యూ శాఖ 5, విద్యుత్ శాఖ 2, గృహ నిర్మాణ శాఖ 2, పంచాయతీరాజ్ శాఖ 1, వైద్య శాఖ 1 తో కూడిన వినతి పత్రాలను మండల ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలో అందజేయడం జరిగింది.

ప్రజావాణిలో వచ్చిన 11 దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు పంపించి ఆన్లైన్ చేసినట్లుగా ఆయన తెలియజేశారు. దరఖాస్తు దారు ప్రజావాణిలో ఇచ్చిన ప్రతి దరఖాస్తు ఆన్లైన్ స్టేటస్ చరవాాణి ద్వారా సైతం చెక్ చేసుకోవచ్చని తెలిపారు.అధికారులు ప్రతి వినతిని పరిశీలించి సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని అధికారులు తెలిపారు.