నర్సాపూర్–యాదగిరిగుట్ట బస్సు సర్వీసు ప్రారంభం
నర్సాపూర్ ఆగస్టు 17: నర్సాపూర్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం నర్సాపూర్ నుంచి తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి నూతన బస్సు సర్వీసును నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు.
ఈ బస్సు సర్వీసు
నర్సాపూర్–వెల్దుర్తి–తూప్రాన్–గజ్వేల్ మీదుగా యాదగిరిగుట్ట వరకు కొనసాగనుంది. దీంతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు యాదగిరిగుట్టకు వెళ్లేందుకు మరింత సౌకర్యవంతమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. యాదగిరిగుట్టకు వెళ్లే భక్తులు, వృద్ధులు, మహిళలు, నియోజకవర్గ ప్రజలకు ఈ బస్సు సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆవుల రాజిరెడ్డి తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి రవాణా సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.






