17 August, 2026 | 8:58 PM

మలేరియా రహిత సమాజమే లక్ష్యం

17-08-2026 07:52 PM

వాంకిడి, (విజయక్రాంతి): మండలంలోని బంబార, గోయేగాం, కనర్గం ఆరోగ్య ఉపకేంద్ర పరిధిలోని మలేరియా ప్రభావిత గ్రామాలైన ఖేడేగాం, వెల్గి, రాజులగూడలలో వైద్య సిబ్బంది సోమవారం విస్తృత మలేరియా నివారణ చర్యలు చేపట్టారు. అలాగే ఇండ్లలో దోమల నివారణ మందును పిచికారి చేశారు.

ఈ సందర్భంగా మండల ఆరోగ్య విస్తరణ అధికారి రవి దాస్ మాట్లాడుతూ.. మలేరియా రహిత సమాజానికి లక్ష్యంగా కృషి చేయాలన్నారు. రాత్రిపూట తప్పనిసరిగా దోమతెరలు వాడాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సునీత, ఆశ కార్యకర్త పార్వతి, ఇబ్బంది తదితరులు ఉన్నారు.