20 March, 2026 | 6:30 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఖైరతాబాద్ ఫ్లుఓవర్‌పై ప్రమాదం

22-07-2024 12:36 AM

బైక్ అదుపుతప్పి ఇద్దరికి గాయాలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): అతివేగంగా బైక్ నడుపుతూ ఫుట్‌పాత్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన రాజ్‌కుమార్ (18) బంజారాహిల్స్ గౌరీశంకర్ కాల నీలో నివాసముంటూ అమీర్‌పేటలోని ఓ జ్యూవెల్లరీ షాపులో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం అతని స్నేహితుడు వివేక్‌తో కలిసి ఖైరతాబాద్ ఫ్లు ఓవర్ మీదు గా ఐమాక్స్ రోటరీ చౌరస్తాకు బయలుదేరాడు. అతివేగంగా ఫ్లుఓవర్ మీదకు రాగానే వాహ నం అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యా యి. వారిని అనుసరిస్తూ మరో బైక్‌పై వస్తు న్న స్నేహితుడు నితీశ్ 108కు సమాచారం అం దించగా, వారు  ఘటనా స్థలానికి చేరుకొని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమా దంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు.