25 June, 2026 | 3:02 AM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం

22-07-2024 12:35 AM

రాజేంద్రనగర్, జూలై 21: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని టీకేఆర్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసు ల కథనం ప్రకారం.. గద్వాల రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన పట్ల సుధీర్‌రెడ్డి, శ్వేతా దంపతులు సాఫ్ట్‌వేర్ ఇంజి నీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. శనివారం సాయంత్రం శ్వేత తన పుట్టింటికి వెళ్లింది. రాత్రి 10 గంట ల సమయంలో తాను స్వగ్రామానికి వెళ్తున్నట్లు సుధీర్‌రెడ్డి ఇంటి యజమాని నారా యణకు చెప్పాడు. కానీ ఎక్కడికీ వెళ్లకుండా ఫ్లాట్‌లోనే ఉన్నాడు. ఆదివారం ఉదయం, ఇంటి యజమాని తలుపులు బద్దలుకొట్టి చూడగా సుధీర్‌రెడ్డి ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. సుధీర్‌రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.