15 April, 2026 | 5:07 PM

డిఫెన్స్ డ్రైవింగ్‌తోనే ప్రమాదాల నివారణ

14-04-2026 01:20 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ 

నిర్మల్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి): డిఫె న్స్ డ్రైవింగ్‌తోనే ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి అన్నారు. సోమవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైన్ భద్రత అవగాహన సదస్సును సారంగాపూర్ మండలం లోని జామ్‌లో ప్రారంభించారు. ఈనెల 18 వరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.

జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అరైవ్ అలైవ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరిస్తూ ట్రాఫిక్ నిబంధనలు, రక్షణాత్మక డ్రైవింగ్ (డిఫెన్సివ్ డ్రైవింగ్) నియమాలు, అలాగే హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత గురించి పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించి, రోడ్డు భద్రతకు సంబంధించి బ్రోచర్ లు విడుదల చేయడం జరిగింది. దీంతో పాటు జిల్లాలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో, గ్రామ సభలను నిర్వహించి గ్రామ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామాల్లోని కమిటీ సభ్యులతో రహదారి భద్రతపై ప్రమాణం చేయించడంతో పాటు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ అధికారి మహేందర్, తహసీల్దార్ సంధ్యా రాణి,ఏం.పి.డి.ఓ లక్ష్మీ కాంత్ రావు, ఏ.ఎం.సి చైర్మన్ అబ్దుల్ హదీ,ఇన్స్పెక్టర్ కృష్ణ,ఎస్‌ఐ శ్రీకాంత్, రవాణా శాఖ అధికారులు సర్పంచ్ పోతన్న, ఉప సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.