15 April, 2026 | 5:07 PM

భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత

14-04-2026 01:20 AM

మీకోసం మీ కుటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది : జిల్లా ఎస్పీ డి జానకి 

నవాబ్ పేట ఏప్రిల్ 13: రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక‘ 99 రోజుల కార్యాచరణలో భాగంగా నవాబుపేట మండలం రుద్రారం గ్రామంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సుకు జిల్లా ఎస్పీ డి. జానకి హాజరై మాట్లాడారు. గ్రామ స్థాయిలో డ్రైవింగ్ లైసెన్స్ లేని అర్హులైన వ్యక్తులను గుర్తించి, వారు లైసెన్స్ పొందేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు, మార్గదర్శకత్వాన్ని పోలీసు శాఖ అందిస్తుందని తెలిపారు.

చట్టబద్ధమైన లైసెన్స్ కలిగి ఉండటం కేవలం నిబంధన మాత్రమే కాదని, అది బాధ్యతాయుతమైన డ్రైవింగ్కు నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ప్రతి ప్రమాదం ఒక కుటుంబానికి తీరని లోటురోడ్డు భద్రతపై ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ సదస్సులో ఆర్ అండ్బీ అధికారి సంధ్య,డిటీఓ రఘు కుమార్, ఆర్టీసీ డిపో మేనేజర్ అశోక్, ఆరోగ్య అధికారి శ్రావణ్, ఎస్త్స్ర విక్రమ్, సర్పంచులు రవి, సంతోషి పాల్గొన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం ఆత్మహత్యాసదృశ్యమని, వేగ పరిమితిని మించవద్దని హెచ్చరించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.ముందస్తు జాగ్రత్తలతో కూడిన డ్రైవింగ్ విధానాలను అలవర్చుకోవడం ద్వారా 90% ప్రమాదాలను నివారించవచ్చని వివరించారు.ప్రమాదం జరిగినప్పు డు వెంటనే స్పందించి, గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించాలని యువతకు పిలుపునిచ్చారు.

గ్రామాల్లోని ప్రమాదకర మలుపులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే చోట్లు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఎస్పీ తెలిపారు. రాత్రి వేళల్లో రోడ్లపై వెళ్లే ట్రాక్టర్లు, వ్యవసాయ వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అంటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని సూచించారు. పాఠశాల విద్యార్థులకు చిన్నతనం నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.కార్యక్రమం చివరలో అందరితో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి, అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సదస్సులో R&B అధికారి సంధ్య, ౄTO రఘు కుమార్, RTC డిపో మేనేజర్ అశోక్, ఆరోగ్య అధికారి శ్రావణ్, ఎస్త్స్ర విక్రమ్, సర్పంచులు రవి, సంతోషి మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.